మార్చి చివరి నాటికి మన ఊరు మనబడి పనులను పూర్తి చేయాలి  జిల్లా కలెక్టర్ అసిస్ సంగ్వాన్

మార్చి చివరి నాటికి మన ఊరు మనబడి పనులను పూర్తి చేయాలి  జిల్లా కలెక్టర్ అసిస్ సంగ్వాన్

ముద్ర ప్రతినిధి,  వనపర్తి : మార్చి చివరి నాటికి మన ఊరు, మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలోని పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఐ డి ఓ సి కాన్ఫరెన్స్ హాల్లో మన ఊరు, మనబడి కార్యక్రమం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 56 పాఠశాలలలో సిసి రోడ్ పనులు, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్లు, ఫ్లోరింగ్ లెవెల్, టాయిలెట్స్ పనులు ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలన్నారు. పూర్తయిన పాఠశాలలో పెయింటింగ్ పనులు 20 లోపు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈవో శ్రవణ్ కుమార్, డీఈవో రవీందర్ , డి ఆర్ డి ఎ, నర్సింలు,  పి ఆర్ ఈ ఈ, మల్లయ్య ఇంజనీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.